ఇద్దరు డ్యాన్సర్లను తీసుకొచ్చి రూమ్ అడిగిన ఎంబీఏ విద్యార్థి... పోలీసులకు పట్టించిన స్టార్ హోటల్ సిబ్బంది!
- ఆన్ లైన్ లో రూమ్ బుక్ చేసుకుని వచ్చిన ఇబ్రహీం
- ఐడీ కార్డు, వివరాలు అడిగితే పొంతన లేని సమాధానాలు
- పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి
ఈ క్రమంలో అతని ఐడీ కార్డు అడిగితే లేదని చెప్పాడు. అమ్మాయిల గురించి ఆరాతీస్తే పొంతన లేని సమాధానం చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన వారు, కాసేపు లాబీలో వెయిట్ చేయాలని చెబుతూ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, సల్మాన్ అనే వ్యక్తి, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో కలసి ఇద్దరు యువతులను అప్పగించాడని, అతనికి రూ. 11 వేలు ఇచ్చానని చెప్పాడు. యువతులను పునరావాస కేంద్రానికి తరలించామని, ఇబ్రహీంపై కేసు పెట్టామని, పరారీలో ఉన్న సల్మాన్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.