బహిరంగ సభలో రిపోర్టును చించేసిన కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గవర్నర్ పై నిప్పులు
- సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో కొర్రీలపై ఆగ్రహం
- ఇది పోలీస్ రాజ్యం కాదని మండిపాటు
- బీజేపీ, ఎల్జీ సీసీటీవీలను అడ్డుకుంటున్నారని ఆరోపణ
ఇందిరాగాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఓ సమావేశానికి హాజరైన కేజ్రీవాల్ సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు సగం తగ్గిపోతాయన్నారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలనుకునేవారు పోలీస్ అధికారుల్ని సంప్రదిస్తే.. సీసీటీవీల ఏర్పాటు అవసరం ఉందో, లేదో వారు తేలుస్తారని ఎల్జీ నియమించిన కమిటీ చెప్పడం దారుణమన్నారు. అనుమతుల పేరుతో సీసీటీవీల ఏర్పాటును బీజేపీ, ఎల్జీ అడ్డుకుంటున్నారని విమర్శించారు.