నేను 'వైయస్సార్సీపీ' అనే పదాన్ని ఉచ్చరించను.. జగన్ పార్టీ అనే పిలుస్తా!: రఘువీరారెడ్డి
- రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత
- ఆయన పేరుతో ఉన్న పార్టీని సమర్థించాల్సిన అవసరం లేదు
- పదవి, డబ్బు కావాలనుకున్నవారంతా కాంగ్రెస్ ను వీడారు
తన నోటి నుంచి వైయస్సార్సీపీ అనే పదం ఎప్పుడూ బయటకు రాదని... తనెప్పుడూ జగన్ పార్టీ అనే పిలుస్తానని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి రాజశేఖరరెడ్డి అని... ఆయన మా నాయకుడని చెప్పారు. ఆయన పేరుతో ఆ పార్టీని పిలవకూడదనే... జగన్ పార్టీ అని పిలుస్తుంటానని తెలిపారు. వైయస్ పేరుతో ఉన్న ఆ పార్టీని సమర్థించాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఇక జగన్ పార్టీలో చేరుతున్నానని ఒకసారి, టీడీపీతో కలసి వెళ్తానని మరోసారి, బీజేపీతో చేయి కలుపుతానని ఇంకొకసారి... ఇలా రకరకాల ప్రచారాలను తనపై చేశారని... తాను కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఏపీలో 90 శాతం మంది కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారని... పదవి, సంపాదన ఉండాలనుకున్న వారంతా పార్టీని వదిలేశారని.... వారి బుద్ధి బయటపడిందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉంటే పదవులు, డబ్బు రావనే వెళ్లిపోయారని అన్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లోకి చేరికలు మొదలయ్యాయని చెప్పారు.