ట్రాయ్ చైర్మన్ శర్మ బ్యాంక్ అకౌంట్ వివరాలు లీక్.. రూ.1 డిపాజిట్ చేసిన హ్యాకర్లు!
- ఏఈపీఎస్ ద్వారా చెల్లింపు జరిపిన హ్యాకర్లు
- ట్విట్టర్ లో స్క్రీన్ షాట్లు పోస్ట్ చేసిన వైనం
- ఆధార్ వివరాలు సురక్షితం అన్నందుకు శర్మను ఆడుకుంటున్న నెటిజన్లు
ఆధార్ వివరాలు అత్యంత సురక్షితమనీ, దమ్ముంటే తన ఆధార్ ను దుర్వినియోగం చేయాలని శర్మ హ్యకర్లకు ట్విట్టర్ లో ఇంతకుముందు సవాలు విసిరారు. తన ఆధార్ నంబర్ 762177682740 ను కూడా బయటపెట్టారు. దీంతో రెచ్చిపోయిన హ్యాకర్లు శర్మ ఈ-మెయిల్, ఆయన అడ్రస్, పాన్, ఓటర్ ఐడీలు, పుట్టిన రోజు, ఎయిర్ఇండియా ఆయనకిచ్చిన ఫ్రీక్వెంట్ ఫ్లయర్ ఐడీలను బయటపెట్టారు.
మరికొందరు హ్యాకర్లయితే ఏకంగా ఆయన ఫొటో, వివరాలతో దొంగ ఆధార్ కార్డును తయారుచేసి ఫేస్ బుక్, ఆమేజాన్ క్లౌడ్ సర్వీసుల్లో రిజిస్టర్ అయ్యారు. మరో వ్యక్తి అయితే శర్మ అడ్రస్ కు వన్ ప్లస్ ఫోన్ ను క్యాష్ ఆన్ డెలివరి ఆర్డర్ పెట్టాడు.