రిగ్గింగ్ జరగడం వల్లే ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలిచింది: మాజీ భార్య రెహం ఖాన్

పాకిస్థాన్ సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) విజయం సాధించడంపై ఆయన మాజీ భార్య రెహం ఖాన్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరగడం వల్లే ఇమ్రాన్ ఖాన్ పార్టీ విజయం సాధించిందని ఆరోపించారు.

 ఓ ఆంగ్ల ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, పాక్ ఎన్నికల ఫలితాలు తనను ఆశ్చర్యపరచలేదని, ఈ ఫలితాలు ఊహించినవేనని అన్నారు. పాక్ సైన్యం నుంచి ఇమ్రాన్ లబ్ధి పొందారని, ఇంకా చాలా మంది ఆయన్ని ప్రోత్సహించి.. ఎంతో పెట్టుబడి పెట్టారని విమర్శించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పాక్ విదేశాంగ శాఖ సైన్యం చేతిలోకి వెళ్లి పోవడం ఖాయమని రెహం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Pakistan
imrankhan
rehamkhan

More Telugu News