Jagan: జగన్ కు మొక్కజొన్న పొత్తులిచ్చిన అభిమానులు.. రుచి చూసిన వైసీపీ అధినేత!
వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజా సంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి ప్రారంభమై రామవరం, గోనెడ, రామచంద్రాపురం మీదుగా వీరవరం వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా జగన్ ని కలిసిన ప్రజలు తమ సమస్యలు విన్నవించుకున్నారు. జగన్ తో కలిసి సెల్ఫీలు దిగేందుకు, ఆయన ఆటో గ్రాఫ్ తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా జగన్ కు మొక్కజొన్న పొత్తులను ఆయన అభిమానులు ఇచ్చారు. అందులో ఒక మొక్కజొన్న పొత్తును ఓ యువతికి ఇచ్చిన జగన్, మరోటి ఆయన తిన్నారు.