Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మళ్లీ 'సైరా' సినిమా ఫొటోలు లీకయ్యాయి!

  • గతంలో లీక్ అయిన కొన్ని చిత్రాలు
  • తాజాగా పోరాట దృశ్యాల ఫొటోలు లీక్
  • సినిమా రిచ్ గా ఉంటుందంటున్న అభిమానులు
చిరంజీవి హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ 'సైరా' స్టిల్స్ మరిన్ని లీక్ అయ్యాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు చిత్రాలు లీక్ కాగా, వాటిలో కొన్నింటి ఒరిజినల్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ తన స్టిల్స్ ను తానే స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేసి యూనిట్ ను షాక్ కు గురి చేశారు కూడా.

ఆపై దర్శక, నిర్మాతలు కాస్తంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, సినిమా లోకేషన్ కు సంబంధించిన ఫొటోలు రెండు ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఓ భారీ కోట తగలబడుతున్న సీన్, బ్రిటిష్ జవాన్ల దుస్తుల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆర్టిస్టుల ఫొటోలు లీక్ అయ్యాయి. ఈ స్టిల్ చూసిన వారంతా సినిమా ఎంతో రిచ్ గా ఉంటుందని అంచనాలు వేస్తున్నారు.
Sairaa
Chiranjeevi
New Movie
Social Media
Leak
Photos

More Telugu News