Haryana: డ్రగ్స్ మత్తులో మేకపై అసహజ లైంగిక చర్య.. ప్రాణం వదిలిన మూగజీవి!

  • హరియాణాలోని నుహ్ పట్టణంలో దారుణం
  • మేక గర్భంతో ఉన్నట్లు తేల్చిన వైద్యులు
  • 8 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
డ్రగ్స్ కు బానిసలైన కొందరు దుండగులు ఓ మేకపై అసహజ లైంగిక చర్యకు దిగారు. దీంతో ఆ మూగజీవి ప్రాణాలు విడిచింది. హరియాణాలోని నుహ్ పట్టణంలో బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

నుహ్ పట్టణంలోని మరోదా గ్రామంలో అస్లూ అనే వ్యక్తికి చెందిన మేకపై 8 మంది యువకులు అసహజ లైంగిక చర్యకు పాల్పడ్డారు. దీంతో మూగజీవి అరుపులు విన్న అస్లూ ఇంటి నుంచి బయటికొచ్చి కేకలు వేయడంతో వారంతా అక్కడ్నుంచి పరారయ్యారు. వెంటనే మేకను ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే అది కన్నుమూసింది.

ఈ ఘటన జరిగిన సమయంలో ఆ మూగజీవి గర్భంతో ఉన్నట్లు వైద్యులు తేల్చారు. యజమాని అస్లూ ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, జంతువుల్ని హింసించేవారికి కఠిన శిక్షలు విధించాలని జంతు సంరక్షణ సంస్థ పెటా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇందుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తమతో కలసిరావాలని ప్రజల్ని కోరింది.
Haryana
nuh
goat
force S*x
pregnent
8 booked
peta

More Telugu News