స్టాలిన్ కు చంద్రబాబు ఫోన్.. కరుణానిధి ఆరోగ్యం గురించి వాకబు!

  • ఆరోగ్యం కుదుటపడుతోందన్న స్టాలిన్
  • కరుణను పరామర్శించిన తమిళనాడు గవర్నర్
  • కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ పరామర్శ 
డీఎంకే అధినేత కరుణానిధి తీవ్ర అస్వస్థతకు గురై, చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరుణానిధి కుమారుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేశారు. కరుణానిధి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కరుణ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆకాంక్షించారు. తన తండ్రి ఆరోగ్యం కుదుటపడుతోందని చంద్రబాబుకు స్టాలిన్ చెప్పినట్టు సమాచారం.

కరుణానిధి కుమార్తె, ఎంపీ కనిమొళి మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని చెప్పారు. బీపీ కూడా సాధారణ స్థాయికి వచ్చిందని తెలిపారు. మరోవైపు, కరుణానిధిని ఈ ఉదయం తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ పరామర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ కూడా కరుణను పరామర్శించారు.
Go Back to Shorts
karunanidhi
stallin
Chandrababu
gulam nabi azad

More Telugu News