'బిగ్ బాస్ హౌస్'లోకి గెస్టుగా శివబాలాజీ?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బిగ్ బాస్ హౌస్'లోకి గెస్టుగా శివబాలాజీ?

  • ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'బిగ్ బాస్ 2'
  • గతంలో విజేతగా నిలిచిన శివబాలాజీ
  • ఇటీవలే గెస్టుగా వెళ్లొచ్చిన యాంకర్ ప్రదీప్
'బిగ్ బాస్' ఫస్టు సీజన్ లో శివబాలాజీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 'బిగ్ బాస్' ఇచ్చిన టాస్కులు విజయవంతంగా పూర్తి చేస్తూ .. తన ప్రవర్తనతో ఆయన ప్రేక్షకుల మనసులు గెలుచుకుని విజేతగా నిలిచాడు. అలాంటి శివబాలాజీ 'బిగ్ బాస్ 2' లోకి గెస్టుగా ఎంటర్ కానున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల బిగ్ బాస్ హౌస్ లోకి ముఖ్య అతిథిగా యాంకర్ ప్రదీప్ వెళ్లాడు. బిగ్ బాస్ హౌస్ లో వున్న వాళ్లందరి కుటుంబసభ్యులను కలుసుకుని మాట్లాడి వచ్చినట్టుగా చెబుతూ .. అందరి మనసులు తేలికపడేలా చేశాడు.

 గెస్టుగా ప్రదీప్ సందడి చేసిన ఎపిసోడ్స్ కి మంచి రేటింగ్ వచ్చిందట. అందువలన మరో గెస్టును హౌస్ లోకి పంపాలనే నిర్ణయానికి వచ్చిన టీమ్, శివబాలాజీని పంపిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. శివబాలాజీని హౌస్ లోకి పంపించడం వలన కంటెస్టెంట్స్ కి మరింత ఉపయోగం కాగలదని భావిస్తున్నారట. అదే నిజమైతే శివబాలాజీ ఎంట్రీ ఎప్పుడు వుంటుందో చూడాలి.      
shivabalaji

More Telugu News