ఈ ఏడాదే రణ్ వీర్ - దీపిక వివాహం.. ధ్రువీకరించిన సన్నిహిత వర్గాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ ఏడాదే రణ్ వీర్ - దీపిక వివాహం.. ధ్రువీకరించిన సన్నిహిత వర్గాలు

  • ఈ ఏడాది చివర్లో ఇటలీలో పెళ్లి వేడుకలు
  • ధ్రువీకరించిన సన్నిహిత వర్గాలు
  • లేక్ కోమో లోని విల్లాడెల్ బాల్బియనెల్లో లో పెళ్లి జరిగే అవకాశం
దేశంలో ప్రస్తుతం సెలబ్రిటీల పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. గతేడాది డిసెంబర్ లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, నటి అనుష్కా శర్మను వివాహమాడగా, ఇటీవల హీరోయిన్ సోనమ్ కపూర్ తన స్నేహితుడు ఆనంద్ అహుజాను, క్రికెటర్ జహీర్ ఖాన్ నటి సాగరికను పెళ్లాడారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ ప్రేమ జంట దీపిక-రణ్ వీర్ సింగ్ లు చేరనున్నారు. రణ్ వీర్ సింగ్, దీపికల వివాహం ఏడాది చివర్లో జరిగే అవకాశముందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.


యూరప్ లో ప్రకృతి అందాలకు నెలవైన ఇటలీలో తమ వివాహ వేడుకను నిర్వహించాలని దీపిక-రణ్ వీర్ కోరుకుంటున్నారట. ఇటలీలోని లేక్ కోమో ప్రాంతాన్ని ఇందుకోసం ఎంచుకునే అవకాశముందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక్కడి విల్లాడెల్ బాల్బియనెల్లోలో గతంలో పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు, క్రీడాకారుల వివాహాలు జరిగాయి. విరాట్, అనుష్క జంట ఇటలీలోని టుస్కనీలో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.
Ranveer singh
Deepika Padukone
marriage
italy

More Telugu News