డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ‘రంగస్థలం’ సింగర్.. పోలీసులతో వాగ్వాదం.. కారు సీజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ‘రంగస్థలం’ సింగర్.. పోలీసులతో వాగ్వాదం.. కారు సీజ్

  • సింగర్ కారును సీజ్ చేసిన పోలీసులు
  • రాహుల్ వెంట యాంకర్ లోబో కూడా
  • లైసెన్స్ కూడా లేకుండా కారు నడిపినట్టు నిర్ధారణ
శుక్రవారం అర్ధరాత్రి జూబ్లీ హిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పట్టుబడ్డాడు. మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్‌ వైపు వస్తున్న రాహుల్‌కు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించగా 178 పాయింట్లు వచ్చాయి. అయితే, తాగిన మైకంలో ఉన్న రాహుల్ పోలీసులకు సహకరించకుండా వారితో వాగ్వాదానికి దిగాడు.

దీంతో కేసు బుక్ చేసిన పోలీసులు కారును సీజ్ చేశారు. రాహుల్‌తోపాటు యాంకర్, నటుడు లోబో కూడా ఉన్నాడు. రాహుల్ సిప్లిగంజ్ లైసెన్స్ లేకుండానే కారు నడిపినట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన రంగస్థలం సినిమాలో టైటిల్ సాంగ్ పాడింది రాహులే. పూర్‌ గర్ల్, మంగమ్మ, మాక్కికిరికిరీ, గల్లీకా గణేష్‌ వంటి ప్రైవేట్‌ ఆల్బమ్‌లతో రాహుల్‌ మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు.
Tollywood
Singer
Rahul
Drunk Driving
Hyderabad

More Telugu News