ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలకే భూమి కేటాయించాలి: ఏపీ మంత్రి అమరనాథరెడ్డి
- చిత్తూరు జిల్లాలో పారిశ్రామిక పురోగతిపై మంత్రి సమీక్ష
- చిన్నపాండూరులో పరిశ్రమల స్థాపనకు ఆసక్తి
- ఆ ప్రాంతంలో భూమి తక్కువగా ఉందన్న మంత్రి
చిన్నపాండూరులో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఎక్కవమంది పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని, ఆ ప్రాంతంలో భూమి తక్కువగా ఉందని, ఎవరైతే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తారో వారికే భూమి కేటాయించాలని అమరనాథరెడ్డి ఆదేశించారు. భూమి ధర అధికంగా నిర్ణయించిన చోట్ల వీలైనంత వరకు వాటి ధరలు పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎంఎస్ఎంఇ పార్కులకు సంబంధించి పరిపాలన అనుమతి ఉత్తర్వులను సత్వరమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.