తానింకా బ్రహ్మచారినేనన్న నాగ చైతన్య... కొంటెగా స్పందించిన సమంత!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తానింకా బ్రహ్మచారినేనన్న నాగ చైతన్య... కొంటెగా స్పందించిన సమంత!

  • బ్యాచ్ లర్ పార్టీ ఏర్పాటు చేసిన సుశాంత్
  • తనను ఎందుకు పిలవలేదన్న నాగ చైతన్య
  • తనలోని బ్రహ్మచారి బతికే ఉన్నాడని వ్యాఖ్య
  • చైతూ చెప్పింది నిజమేనన్న సమంత
నాగార్జున మేనల్లుడు సుశాంత్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ (అందాల రాక్షసి ఫేమ్) తెరకెక్కిస్తున్న 'చి.ల.సౌ' చిత్రం విడుదలకు సిద్ధంకాగా, ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో యూనిట్ బిజీగా ఉంది.

 తాజాగా, సుశాంత్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "హలో బాయ్స్ అండ్ గాల్స్... నా బ్యాచ్ లర్ పార్టీకి మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాను. కింద ఉన్న గూగుల్ లింక్ తెరచి, పెళ్లిని వాయిదా వేసుకునేందుకు మీరు ఏ కారణం చెబుతారో తెలియజేయండి. గెలుపొందినవారికి రిలీజ్ కు ముందే సినిమాను చూపించి, అద్భుతమైన పార్టీ ఇస్తాను" అని చెప్పాడు.

 దీనిపై స్పందించిన నాగ చైతన్య, "దట్స్ క్రేజీ మ్యాన్. కేవలం బ్యాచిలర్స్ నే పిలుస్తారా? నన్ను మరచిపోయినట్టున్నావు. నాలోని బ్రహ్మచారి ఇంకా బతికే ఉన్నాడు" అని పోస్టు పెట్టగా, సమంత కొంటెగా స్పందించింది. "భర్తగారూ... మీరు చెప్పింది నిజమే" అని వ్యాఖ్యానించింది. ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతుండగా, వీటిని చూసిన ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. 
Sushant
Samantha
Naga Chaitanya

More Telugu News