ఆ దర్శకుడు, హీరో నన్ను అవమానపరిచారు .. అది ఊరకనే పోలేదు!: యాంకర్ ఝాన్సీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ దర్శకుడు, హీరో నన్ను అవమానపరిచారు .. అది ఊరకనే పోలేదు!: యాంకర్ ఝాన్సీ

  • ఓ పెద్ద హీరో సినిమా అది 
  • నాతో ఓ క్యారెక్టర్ రెండు రోజులు చేయించారు 
  • నాకు చెప్పకుండా వేరొకరిని తీసుకున్నారు
ఇటు బుల్లితెరపై యాంకర్ గా .. అటు వెండితెరపై నటిగా ఝాన్సీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఝాన్సీ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కెరియర్లో తనకి ఎదురైన కొన్ని అనుభవాలను గురించి ప్రస్తావించింది. "నేను ఎవరినీ కూడా నాకు వర్క్ ఇవ్వమని అడగలేదు. అలాగే అవతలవాళ్లు ఇవ్వాల్సిన డబ్బుల గురించి కూడా పదే పదే అడగలేదు .. గొడవపడలేదు .. ఇళ్లకి మనుషులను పంపించలేదు. నా మనసుకు కష్టం కలిగించిన వాళ్లను కట్ చేసేదానిని అంతే.

నన్ను ఇబ్బంది పెట్టినవారికి నా శాపం గట్టిగానే తగిలింది. రెండు రోజులు క్యారెక్టర్ చేయించుకుని పీకేసిన వాళ్లకి నా శాపమెలా వుంటుందనేది తెలుసు. ఒక పెద్ద డైరెక్టర్ .. పెద్ద హీరో .. నాతో రెండు రోజులు క్యారెక్టర్ చేయించుకున్నారు .. నా డబ్బులు నాకు ఇచ్చేశారు. నాకు చెప్పాపెట్టకుండా వేరే వ్యక్తితో ఆ పాత్రను చేయించి నన్ను అవమాన పరిచారు. వాళ్లకి నా శాపం బాగా తగిలింది .. ఇంతవరకూ వాళ్లు కోలుకోలేదు" అంటూ చెప్పుకొచ్చింది.    
jhansi

More Telugu News