మూడు నెలల రాహుల్ గాంధీ ప్లాన్ ఫలితమే ఆ కౌగిలింత!: కాంగ్రెస్ వర్గాలు వెల్లడించిన వాస్తవం
- అవిశ్వాస తీర్మానం తరువాత మోదీకి రాహుల్ కౌగిలింత
- దేశవ్యాప్తంగా పతాక శీర్షికల్లో ఇరు నేతల హగ్
- ఎంతో ప్రణాళికతో, పక్కా టైమింగ్ తో రాహుల్ కౌగిలించుకున్నారన్న కాంగ్రెస్ నేత
గాంధీ కుటుంబాన్ని, ముఖ్యంగా తన తల్లిని పదే పదే విమర్శిస్తున్న ప్రధానికి రాహుల్ గాంధీ ఈ విధంగా తన నిరసన తెలిపారని ఆయన అన్నారు. ఆయన తన ఆలింగనం ద్వారా ప్రధానిని ఆశ్చర్యపోయేటట్టు చేశారని అందరూ భావిస్తున్నారని, కానీ ఈ విషయంలో రాహుల్ టైమింగ్ మాత్రం ప్రధానితో తలపడటాన్నే సూచిస్తోందని ఆయన అన్నారు. వాస్తవానికి ప్రధాని మాట్లాడే సమయంలోనో లేదా తన ప్రసంగం మధ్యలోనో ఈ కౌగిలింతను ఇవ్వాలని ఆయన భావించారని, చివరకు తన ప్రసంగం ముగిసిన తరువాతే సరైన సమయమన్న భావనకు రాహుల్ వచ్చారని తెలిపారు.