తొలి షెడ్యూల్ పూర్తయిందంటూ క్రిష్ ట్వీట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తొలి షెడ్యూల్ పూర్తయిందంటూ క్రిష్ ట్వీట్!

  • యువ ఎన్టీఆర్ పాత్రలో మోక్షజ్ఞ 
  • శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ 
  • జనవరి 9వ తేదీన విడుదల  
'ఎన్టీఆర్' బయోపిక్ కి క్రిష్ ను దర్శకుడిగా ఎంచుకున్న దగ్గర నుంచి, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఊపందుకున్నాయి. ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా, తాజాగా ఫస్టు షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ .. బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లోని కీలకమైన సన్నివేశాలను ప్రత్యేకంగా వేసిన సెట్లో చిత్రీకరించారు.

ప్రస్తుతం రెండవ షెడ్యూల్ కి సంబంధించిన సన్నాహాల్లో ఈ సినిమా టీమ్ వుంది. ఈ సినిమాలో రానా .. ప్రకాశ్ రాజ్ .. సీనియర్ నరేశ్ ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్ ఎన్టీఆర్ గా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కనిపించే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక శ్రీదేవి పాత్రలో రకుల్ కనిపించే ఛాన్స్  ఉందని కూడా అంటున్నారు. ఈ రెండు విషయాలు ఈ ప్రాజెక్టుపై అందరిలోను మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.     
balakrishna
vidyabalan

More Telugu News