'సైరా నరసింహారెడ్డి' అంటున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్!
- రోజుకో వేషంతో నిరసన
- నేడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా రాక
- కరవాలానికి పని చెబుతానని వ్యాఖ్య
వెంటనే రాష్ట్రానికి ఇస్తామన్న హామీలన్నీ నెరవేర్చాలని, లేకుంటే నరసింహారెడ్డి తన కరవాలానికి పని చెబుతాడని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చి తీరాల్సిందేనని అన్నారు. కాగా, గతంలో ఓ మహిళగా, స్కూలు బాయిగా, అన్నమయ్యగా, మత్స్యకారుడిగా, రజకుడిగా పలు రకాల వేషాల్లో శివప్రసాద్ పార్లమెంట్ ముందు నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే.