ఎన్నో అవమానాలు ఎదురైనా మా నాన్న నిలదొక్కుకున్నారు: మంచు లక్ష్మి
- మా నాన్నను ఉద్యోగాల్లో నుంచి తీసేశారు
- నటుడు కాలేడంటూ అవమానించారు
- అయినా ఆయన నిలదొక్కుకున్నారు
ఇంత పొడుగ్గా వున్నావ్ .. నువ్వేం యాక్టర్ వి అవుతావ్? అంటూ నిరుత్సాహ పరిచినవాళ్లు చాలామంది వున్నారు. కష్టపడి ఆయన ఆ విమర్శలను తిప్పికొట్టారు. కొంతమంది అవమానించారని చెప్పేసి నిరాశపడిపోయి ఆ రోజున ఆయన ఊరెళ్లిపోయి వ్యవసాయం చేసుకుందామనుకుని వుంటే కనుక, ఈ రోజున మేము ఇక్కడ ఉండేవాళ్లం కాదు. తన ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలనే పట్టుదలతో ఆయన నిలదొక్కుకున్నారు. మా నాన్న నాకు ఇచ్చిన లైఫ్ ను నేను నా కూతురికి ఇవ్వాలని అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.