ఏపీకి హోదా ఇస్తే.. తెలంగాణకు కూడా ఇవ్వాల్సిందే: హరీష్ రావు
- ఏపీకి హోదా ఇస్తే పరిశ్రమలన్నీ అక్కడకు వెళ్లిపోతాయి
- తెలంగాణ ప్రజలు రోడ్డున పడతారు
- తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పష్టతను ఇవ్వాలి
ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పష్టతను ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మొన్న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కూడా ఏపీకి హోదాకు సంబంధించి తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలోనే, హరీష్ రావు ఈమేరకు డిమాండ్ చేశారు.