శంకరంబాడి సుందరాచారి వేషధారణతో నిరసన తెలిపిన ఎంపీ శివప్రసాద్
- ఏపీకి అన్యాయం చేయవద్దంటూ గీతాలాపన
- మోదీ ఏం చేయకపోయినా, చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారన్న ఎంపీ
- గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టిన టీడీపీ ఎంపీలు
మరోవైపు, పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ రైల్వే జోన్ మంజూరు చేయాలని, విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీకి న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని ఆపబోమని అన్నారు.