శాంతించిన గోదావరి.. తగ్గుతున్న వరద ప్రవాహం!

  • కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 12.96 మీటర్లుగా నమోదు
  • సముద్రంలోకి 3,52,620 క్యూసెక్కుల నీరు
  • మళ్లీ ఊపందుకోనున్న పోలవరం పనులు
ఎగువన కురుస్తున్న వర్షాలతో గత కొన్ని రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి... క్రమంగా శాంతిస్తోంది. గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాజమండ్రి వద్ద ఉన్న కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 12.96 మీటర్లుగా నమోదయింది. అక్కడి నుంచి తూర్పు, పడమర కాల్వలకు 12 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. సముద్రంలోకి 3,52,620 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు వరద తగ్గుముఖం పట్టడంతో, పోలవరం పనులు మళ్లీ ఊపందుకోనున్నాయి.  
Go Back to Shorts
godavari
floods

More Telugu News