రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నా.. వయసువల్ల కావచ్చు!: కేటీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నా.. వయసువల్ల కావచ్చు!: కేటీఆర్

  • 42వ పుట్టినరోజును జరుపుకుంటున్న కేటీఆర్
  • ఆదివారం నుంచి జ్వరంతో బాధపడుతున్న వైనం
  • కేక్ కట్ చేసే బదులు మొక్క నాటాలంటూ పిలుపు
తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్మదినం నేడు. ఈ రోజు ఆయన 42వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పుట్టినరోజు సందర్భంగా పలు జిల్లాల్లో భారీ పోస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే, తన పుట్టినరోజు సందర్భంగా పోస్టర్లకు అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించాలని కేటీఆర్ సూచించారు. కేకులు కట్ చేసే బదులు, మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా కేటీఆర్ స్పందిస్తూ, జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మిమ్మల్ని కలసి పేరుపేరునా ధన్యవాదాలను చెప్పాలని ఉందని... కానీ ఆదివారం నుంచి తాను జ్వరంతో బాధపడుతున్నానని... బహుశా వయసు రీత్యా అయి ఉండవచ్చని చెప్పారు.
KTR
birthday
fever

More Telugu News