కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసిన బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్.. ధర కోట్లలోనే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసిన బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్.. ధర కోట్లలోనే!

  • వర్లీలో ఖరీదైన ఓ డూప్లెక్స్ ఫ్లాట్ 
  • 8,625 చదరపు అడుగుల విస్తీర్ణం 
  • దీని ఖరీదు రూ.55.60 కోట్లు?
ఖరీదైన డ్రెస్సులు ధరించడం, ఖరీదైన వాహనాలు, ఫ్లాట్స్  కొనుగోలు చేయడం బాలీవుడ్ నటీనటులకు కొత్తేమీ కాదు. ఈ జాబితాలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ కూడా తాజాగా చేరాడు. ప్రస్తుతం ముంబైలోని జుహులో ఉన్న ప్రణీత భవనంలో షాహిద్ నివసిస్తున్నాడు. ఈ ప్రాంతంలో వ్యభిచార కార్యకలాపాలు ఎక్కువైపోతుండటంతో షాహిద్ తన మకాం మార్చాలనుకున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో ముంబైలోని వర్లీలో ఖరీదైన ఓ డూప్లెక్స్ ఫ్లాట్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దీని ఖరీదు రూ.55.60 కోట్లు ఉంటుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. షాహిద్ పంకజ్ కపూర్, మీరా పేర్లతో దీని రిజిస్ట్రేషన్ జరిగిందట. రిజిస్ట్రేషన్ నిమిత్తం ఇప్పటికే రూ.2.19 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. 8,625 చదరపు అడుగులున్న ఈ కొత్త ఫ్లాట్  42వ అంతస్తులో ఉందట. 
shahid kapoor
Bollywood

More Telugu News