రేహమ్‌ను పెళ్లాడి చాలా పెద్ద తప్పు చేశా: ఇమ్రాన్ ఖాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేహమ్‌ను పెళ్లాడి చాలా పెద్ద తప్పు చేశా: ఇమ్రాన్ ఖాన్

  • సంచనలం సృష్టిస్తున్న రెండో భార్య ఆటోబయోగ్రఫీ
  • ఇమ్రాన్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు
  • ఎట్టకేలకు స్పందించిన ఇమ్రాన్
క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఎదిగారు. ఆయన సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. క్రికెట్‌లో, రాజకీయాల్లో ఇమ్రాన్ ఎంత సంచలనమో, అతడి వ్యక్తిగత జీవితం కూడా అంతే వివాదాస్పదం. ఇప్పటికే ఇధ్దరిని పెళ్లాడిన ఇమ్రాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడో పెళ్లి చేసుకున్నారు.

తాజాగా, ఆయన రెండో భార్య రేహమ్ ఖాన్ రాసిన ఆటోబయోగ్రఫీ రిలీజ్‌కు ముందే సంచలనాలు క్రియేట్ చేసింది. పుస్తకంలోని పలు చాప్టర్లు లీకవడంతో కలకలం రేగింది. ఇమ్రాన్ గురించి అందులో పలు సంచలన విషయాలను వెల్లడించారు. ఇమ్రాన్ హోమో సెక్సువల్ అనీ, పాక్ నటుడితోపాటు అతడి పార్టీలోని కొందరితో ఇమ్రాన్‌కు సంబంధాలు ఉన్నాయని అందులో ఆరోపించారు. అంతేకాదు, ఇమ్రాన్‌కు అక్రమంగా పుట్టిన ఐదుగురు పిల్లలు భారత్‌లో పెరుగుతున్నారంటూ అందులో పేర్కొన్నారు. దీంతో పాకిస్థాన్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది.  

రేహమ్ ఖాన్ పుస్తకంలోని ఆరోపణలపై తాజాగా ఇమ్రాన్ స్పందించారు. రేహమ్‌ను పెళ్లి చేసుకుని జీవితంలో అతిపెద్ద తప్పు చేశానని పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా రేహమ్ గురించి ఏమీ చెప్పనని, కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదన్నారు. ‘‘నేను నా జీవితంలో చాలా తప్పులు చేశాను. రేహమ్‌ను పెళ్లాడడం జీవితంలో నేను చేసిన అన్నింటి కంటే పెద్ద తప్పు’’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇమ్రాన్ సూఫీ స్కాలర్ బుష్రా మనేకను మూడో వివాహం చేసుకున్నారు. ఈ విషయం గురించి చెబుతూ పెళ్లయ్యేంత వరకు ఆమె ముఖాన్ని తాను చూడలేదన్నారు.
Imrankhan
Pakistan
Reham khan

More Telugu News