పోర్న్ మూవీ చూసి ఏడ్చేసిన సన్నీలియోన్.. ఆమె బయోపిక్ లో ఓ సన్నివేశం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోర్న్ మూవీ చూసి ఏడ్చేసిన సన్నీలియోన్.. ఆమె బయోపిక్ లో ఓ సన్నివేశం!

  • సన్నీలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సీన్ 
  • గురునానక్‌ను క్షమాపణ వేడుకున్న నటి
  • సినిమాలోని ప్రతీ కన్నీటి బొట్టు తనదేనన్న సన్నీ
బాలీవుడ్ స్టార్ నటి సన్నీలియోన్ తన జీవిత కథ ఆధారంగా రూపొందించిన కరన్‌జీత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్’ వెబ్ సిరీస్‌ సంచలనం అయింది. దీనికి సంబంధించి ఒక సన్నివేశం ఎవర్నైనా కదిలిస్తుంది. టీనేజ్ లో వున్నప్పుడు సన్నీ తొలిసారిగా ఓ పోర్న్ సినిమా (నీలి చిత్రం) చూసింది. ఆ తర్వాత తను తట్టుకోలేకపోయింది. ఎంత అణచిపెట్టుకున్నా కన్నీటిని బయటకు రాకుండా నియంత్రించుకోలేకపోయింది. ముఖాన్ని చేతుల్లో దాచుకుని ఏడ్చేసింది.

గురునానక్ ఫొటోపై చేతులు వేసి క్షమాపణలు వేడుకుంది. ‘‘బాబాజీ తప్పు జరిగిపోయింది. నాకు తెలియకుండానే పెద్ద తప్పు చేశాను’’ అని వేడుకుంది. వెబ్ సీరీస్ లోని ఈ సన్నివేశం సన్నీలో మనకు తెలియని కోణాన్ని ఆవిష్కరిస్తుందని అంటున్నారు.  

సన్నీలియోన్ బయోపిక్ కరన్‌జీత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్’లో స్వయంగా సన్నీనే నటించింది. తన జీవితంలో జరిగిన అన్ని విషయాలను దర్శకనిర్మాతలకు పూసగుచ్చినట్టు గతంలో ఓసారి తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సినిమాలో కనిపించే ప్రతీ సీనూ నిజమేనని, ప్రతీ కన్నీటి బొట్టు నిజమైనదేనని, తనదేనని వివరించింది.

సన్నీ తనకు తానుగానే పోర్న్ స్టార్‌గా మారింది. సన్నీ అనేది ఆమె పేరు కాదు. ఆమె అన్నయ్య పేరు. ఆ పేరుతోనే అడల్ట్ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆమె.. బాలీవుడ్‌లోకీ ప్రవేశించి సంచలనాలకు కారణమైంది. పలు వివాదాలకూ కారణమైంది. సిక్కు మత ఆచారాలను పాటించని ఆమె ‘కౌర్’ అనే పదాన్ని ఉపయోగించడం సరికాదని, టైటిల్‌లోని ఆ పదాన్ని తొలగించాలని సిక్కుమత పెద్దలు డిమాండ్ చేశారు. కాగా, అన్ని సినిమాలకు ఉన్నట్టుగానే సన్నీ బయోపిక్‌లోని పలు ఎపిసోడ్లు ఇప్పటికే టొరెంట్ సైట్లలో దర్శనమిస్తున్నాయి.  
Sunny Leone
Bollywood
Biopic
Actress

More Telugu News