Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమ్మా ఒట్టు... పెళ్లి చేసుకుంటా: తల్లికి నితిన్ హామీ

  • పెళ్లి ప్రస్తావనను వాయిదా వేస్తూ వచ్చిన నితిన్
  • ఈ సినిమా కథ విన్నాక పెళ్లి చేసుకోవాలని అనిపించింది
  • 'శ్రీనివాస కల్యాణం' ఆడియో వేడుకలో తల్లికి హామీ
గత కొంతకాలంగా తన తల్లి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుండగా, ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా తనకు ఇప్పుడే పెళ్లి ఉద్దేశం లేదని చెబుతూ వచ్చానని, కానీ, సతీష్ వేగేశ్న చెప్పిన 'శ్రీనివాస కల్యాణం' కథ వినగానే పెళ్లి చేసుకోవాలన్నంత అనుభూతి వచ్చిందని హీరో నితిన్ వ్యాఖ్యానించాడు.

రాశీ ఖన్నాతో కలసి ఆయన నటించిన శ్రీనివాస కల్యాణం చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం నిన్న రాత్రి హైదరాబాద్ లో జరుగగా, నితిన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆడియన్స్ లో కూర్చున్న తన తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ, "కథ విన్నాక పెళ్లి చేసుకోవాలనిపించింది. కానీ.. సెట్లో పూజలు, వ్రతాలు చూసి పెళ్లి అంటే ఇంత కష్టమా? అనిపించింది. కానీ పెళ్లి మాత్రం చేసుకొంటా. అమ్మా... ఒట్టు! పెళ్లి చేసుకుంటా" అని అన్నాడు. దీంతో ఆహూతులంతా చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు.

తన కెరీర్ లో టాప్ చిత్రాల్లో 'శ్రీనివాస కల్యాణం' ఒకటిగా నిలుస్తుందని నితిన్ చెప్పాడు. ఇదే కార్యక్రమంలో రాశీ ఖన్నా మాట్లాడుతూ, తన కెరీర్ లోనే ఉత్తమ చిత్రంగా ఇది నిలుస్తుందని, కథ వినగానే భావోద్వేగానికి లోనయ్యానని వ్యాఖ్యానించింది. నితిన్ తో మరిన్ని సినిమాలు చేయాలని ఉందని చెప్పింది.
Nitin
Srinivasa Kalyanam
Audio
Rasi Khanna

More Telugu News