అది కౌగిలింత కాదు.. మోదీకి పెద్ద షాక్: శివసేన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అది కౌగిలింత కాదు.. మోదీకి పెద్ద షాక్: శివసేన

  • రాజకీయాల్లో రాహుల్ రాటుదేలారు
  • రాహుల్ ప్రసంగం అద్భుతంగా ఉంది
  • దమ్ము, ధైర్యం ఉంటేనే ఉద్ధవ్ థాకరే లాంటి నిర్ణయం తీసుకుంటారు
లోక్ సభలో ప్రధాని మోదీని రాహుల్ గాంధీ కౌగిలించుకోవడంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, అది కౌగిలింత కాదని, మోదీకి రాహుల్ గాంధీ ఇచ్చిన పెద్ద షాక్ అని అన్నారు. రాహుల్ చేసిన ప్రసంగం అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. రాజకీయాల్లో రాహుల్ రాటుదేలారని చెప్పారు.

 అవిశ్వాస తీర్మానానికి హాజరుకాకూడదని తమ అధినేత ఉద్ధవ్ థాకరే తీసుకున్న నిర్ణయం సరైనదని తెలిపారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే దమ్ము, ధైర్యం ఉండాలని... ఉద్ధవ్ థాకరే దాన్ని చేతల్లో చూపించారని చెప్పారు. శివసేనకు చెందిన మరో నేత ఆనందరావ్ అద్సూల్ మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత నిర్ణయాలను తాము శిరసా వహిస్తామని చెప్పారు. భూసేకరణ, పెద్ద నోట్ల రద్దు వంటి ఎన్నో విషయాలలో మోదీ ప్రభుత్వం పొరపాట్లను చేసిందని... అందుకే అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాము హాజరుకాలేదని తెలిపారు. 
Rahul Gandhi
sanjay raut
Narendra Modi
hug

More Telugu News