‘హగ్స్ ఇన్ పార్లమెంట్’ అంటూ ‘అమూల్’ సెటైర్లు
- మోదీని కౌగిలించుకున్న రాహుల్ పై సెటైర్లు
- ఓ వ్యంగ్యచిత్రాన్ని తన ప్రచారాస్త్రంగా వాడుకున్న సంస్థ
- నెటిజన్ల భిన్న వ్యాఖ్యలు
తాజాగా, గుజరాత్ కు చెందిన అమూల్ కో-ఆపరేటివ్ డెయిరీ దీనిపై ఓ వ్యంగ్య చిత్రాన్ని రూపొందించి తన ప్రచారానికి వాడుకుంది. ఈ వ్యంగ్య చిత్రంలో కుర్చీలో కూర్చుని ఉన్న మోదీని రాహుల్ కౌగిలించుకుంటూ..కన్నుగీటుతుండటం మనకు కనిపిస్తుంది. ‘కౌగిలించుకుంటున్నారా మీరు ఇబ్బందిపెడుతున్నారా?’ అనే క్యాప్షన్ తో పాటు ‘అమూల్.. హగ్స్ బ్రెడ్ డైలీ!’ అని రాసి ఉంది. ఈ వ్యంగ్య చిత్రాన్ని అమూల్’ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు భిన్న వ్యాఖ్యలు చేయడం గమనార్హం.