సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'ఇక్కడ భలే తమాషాలు' అంటున్న రకుల్!  
  • మహేశ్ న్యూయార్క్ షెడ్యూల్ ఖరారు 
  • వర్మ దర్శకత్వంలో మరో బయోపిక్! 
*  'సినిమా రంగంలో భలే తమాషాలు చోటుచేసుకుంటాయి' అంటోంది అందాలతార రకుల్ ప్రీత్ సింగ్. దాని గురించి మరింతగా చెబుతూ, 'నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కొన్ని సినిమాల్లో బుక్ చేసుకుని ఆ తర్వాత నన్ను వద్దని తిరస్కరించారు. అప్పుడు చాలా అప్సెట్ అయ్యాను. అలాంటి నేను ఆ తర్వాత సక్సెస్ అయ్యాక డేట్స్ సర్దుబాటు చేయలేక నేనే కొన్ని సినిమాలు వదిలేశాను. ఇలాంటి తమాషాలు ఇక్కడే జరుగుతుంటాయి' అని చెప్పింది.
*  మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన కొంత భాగం షూటింగ్ అమెరికాలో నిర్వహించనున్నారు. న్యూయార్క్ నగరంలో ఈ షూటింగును అక్టోబర్లో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మహేశ్ సరసన ఇందులో పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది.
*  బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బయోపిక్ గా వచ్చిన 'సంజు' చిత్రం ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. కాగా, సంజయ్ జీవితంపై మరో హిందీ చిత్రాన్ని నిర్మించడానికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సన్నాహాలు చేస్తున్నారు. సంజయ్ దత్ తో వర్మకు సన్నిహిత సంబంధాలు వుండడం వల్ల ఈ చిత్రాన్ని కొత్త కోణంలో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.
Rakul
Mahesh Babu
Varma
Pooja

More Telugu News