బీజేపీని మాట్లాడనీయకుండా రాహుల్ చేశారు: శశిథరూర్ ప్రశంసలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీని మాట్లాడనీయకుండా రాహుల్ చేశారు: శశిథరూర్ ప్రశంసలు

  • రాహుల్ ‘గేమ్ ఛేంజింగ్ స్పీచ్’ చేశారు
  • ప్రభుత్వాన్ని నిలదీశారు
  • ‘భూకంప్ ఆగయా’ హ్యాష్ టాగ్ తో శశిథరూర్ ట్వీట్  
లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ నిమిత్తం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. బీజేపీ నేతలను మాట్లాడనీయకుండా రాహుల్ చేశారని, ఆయనది ‘గేమ్ ఛేంజింగ్ స్పీచ్’ అని కొనియాడుతూ ట్వీట్ చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటు హామీల గురించి రాహుల్ నిలదీశారని, మోదీని అనుకోని ఆలింగనం చేసుకుని రాహుల్ తన ప్రసంగాన్ని ముగించారని శశిథరూర్ అన్నారు. ‘భూకంప్ ఆగయా’ అనే హ్యాష్ టాగ్ తో శశిథరూర్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం.

కాగా, తనను లోక్ సభలో మాట్లాడనివ్వడం లేదని, తాను మాట్లాడితే భూకంపం వస్తుందని రాహుల్ గతంలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.‘భూకంప్ ఆనే వాలా హై’ అనే హ్యాష్ ట్యాగ్ తో  ఈ వ్యాఖ్యలపై నాడు బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

ఇదిలా ఉండగా, లోక్ సభలో రాహుల్ ప్రసంగంపై కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ కూడా ప్రశంసలు కురిపించారు. సాధారణ ప్రజలు, రైతులు, వ్యాపారులు, మహిళలకు సంబంధించిన అంశాల గురించి రాహుల్ ప్రస్తావించడం బాగుందని అన్నారు.  
bjp
shsi tharur

More Telugu News