విజయవాడ ముజ్రా పార్టీ కేసులో ముగ్గురికి తప్ప అందరికీ బెయిల్!
- మొత్తం 50 మందికి పైగా అరెస్ట్
- ఆరు నెలలుగా అశ్లీల పార్టీలు
- మరింతగా విచారించాల్సి వుందన్న పోలీసులు
ఇక నిన్న కీలక నిందితులను విచారించిన పోలీసులు పలు కీలక విషయాలను విచారణలో రాబట్టారని తెలుస్తోంది. గత ఆరు నెలలుగా వీరు పార్టీల పేరిట అశ్లీల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, నాలుగు నెలల పాటు మాచవరంలో, గత రెండు నెలలుగా భవానీపురంలో పార్టీలు ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. 'వీ కిట్టీ పార్టీ' పేరిట హోటల్ ను బుక్ చేసుకుంటున్నారని, వీరికి హోటల్ మేనేజర్ చైతన్య సహకారాన్ని అందిస్తుండగా, సుఖేష్, సునీల్ లు అమ్మాయిలను తేవడం, విటులకు గదుల బుకింగ్ తదితర పనులను చూసుకుంటున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.