బీజేపీయేతర పార్టీలకు లేఖలు రాసిన చంద్రబాబు

  • ఏపీని బీజేపీ మోసం చేసింది
  • హోదాతో పాటు 18 అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి
  • అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వండి
దేశంలోని బీజేపీయేతర పార్టీలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఈ లేఖలతో పాటు విభజన చట్టం అమలుకు సంబంధించిన బుక్ లెట్ ను కూడా పంపారు. 2014లో ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ఏపీని బీజేపీ మోసం చేసిందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశంతో పాటు 18 అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని... తమ హక్కులను సాధించుకునేందుకే అవిశ్వాసం నోటీసును ఇచ్చామని చెప్పారు. తాము ప్రవేశ పెట్టిన అవిశ్వాసానికి అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కోరారు.
Go Back to Shorts
Chandrababu
letter
all parties

More Telugu News