ఏ సినిమాతోనూ 'వైఫ్ ఆఫ్ రామ్'కి పోలిక లేదు: మంచు లక్ష్మి
- ఇది ఓ మధ్యతరగతి భార్య కథ
- పాటలు .. డాన్సులు వుండవు
- అయినా అందరికీ నచ్చుతుంది
కథా పరంగా పాటలు .. డాన్సులు లేకపోయినా ఎక్కడా వాటిని గురించిన ఆలోచన రాదు. ఒక మధ్యతరగతి ఇల్లాలు .. ఒకానొక సంఘటనతో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందనే కథాంశంతో ఈ సినిమా అనూహ్యమైన మలుపులతో కొనసాగుతుంది. ఇది ఓ భార్య చుట్టూ తిరిగే కథ కావడం వలన 'కహాని' సినిమాతో పోల్చవద్దు. ఏ సినిమాకి 'వైఫ్ ఆఫ్ రామ్'తో పోలికలు వుండవు అని కచ్చితంగా చెబుతున్నాను. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చారు.