మోదీపై పరోక్ష విమర్శలు గుప్పిస్తూ రాహుల్‌ ట్వీట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీపై పరోక్ష విమర్శలు గుప్పిస్తూ రాహుల్‌ ట్వీట్!

  • అగ్నివేశ్ పై బీజేవైఎం దాడిని ఖండించిన రాహుల్
  • దాడి వీడియోను పోస్ట్ చేసిన వైనం
  • మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు 
బీజేపీపై వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ తాజాగా మరో ట్వీట్ చేశారు. సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ పై బీజేవైఎం కార్యకర్తలు దాడికి పాల్పడటంపై రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ట్వీట్ లో ప్రధాని మోదీపై పరోక్ష విమర్శలు చేశారు. ‘ద్వేషం, భయంను ఉపయోగించి అధికారం అనుభవిస్తాను, బలహీనులను అణచివేస్తా.. నేను ఎవరిని?’ అంటూ రాహుల్ తన ట్వీట్ లో ప్రశ్నించారు. స్వామి అగ్నివేశ్ పై బీజేవైఎం కార్యకర్తలు దాడికి పాల్పడుతున్న వీడియోను రాహుల్ జతచేశారు.  
modi
rahul

More Telugu News