పతనావస్థలో అన్నాడీఎంకే.. సభ్యత్వాలను రెన్యువల్ చేసుకోని 60 లక్షల మంది కేడర్!
- జయలలిత ఉన్నప్పుడు 1.50 కోట్లు దాటిన సభ్యత్వాలు
- ప్రస్తుతం 90 లక్షలకే పరిమితం
- కలవర పడుతున్న పార్టీ నేతలు
60 లక్షలకు పైగా కేడర్ తమ పార్టీ సభ్యత్వాన్ని కొనసాగించలేదు. జయలలిత ఉన్నప్పుడు పార్టీ సభ్యత్వాలు కోటి యాభై లక్షలు దాటగా... ప్రస్తుత సభ్యత్వాలు కేవలం 90 లక్షలకే పరిమితమయ్యాయి. మిగిలివారంతా తిరుగుబాటు నేత టీటీవీ దినకరన్ వైపు వెళ్లినట్టుగా భావిస్తున్నారు. ఈ పరిణామాలు పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేడర్ ను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు పళని, పన్నీర్ లు ప్రణాళికలు రచిస్తున్నారు.