చరణ్ మూవీలో ఇంట్రవెల్ సీన్ ఒక రేంజ్ లో వుంటుందట!
- బోయపాటి దర్శకత్వంలో చరణ్
- ఆగస్టు 15వ తేదీన ఫస్టులుక్ రిలీజ్
- జనవరి 11వ తేదీన సినిమా విడుదల
సాధారణంగానే బోయపాటి తన సినిమాల్లో ఇంట్రవెల్ బ్యాంగ్స్ అదిరిపోయేలా చూసుకుంటూ ఉంటాడు. ఈ సినిమాలో ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా ఒక రేంజ్ లో వుంటుందట. అనూహ్యమైనదిగా .. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేదిగా ఇంట్రవెల్ బ్యాంగ్ వుంటుందని అంటున్నారు. ఒక అద్భుతమైన ట్విస్ట్ తో బోయపాటి ఇంట్రవెల్ బ్యాంగ్ ను డిజైన్ చేసినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేసి, ఆగస్టు 15వ తేదీన ఫస్టులుక్ ను విడుదల చేయనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, జనవరి 11వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తారు.