జగన్ అభిమానులు ఏమనుకున్నా నాకు నష్టం లేదు!: ఉండవల్లి

  • చంద్రబాబుతో భేటీలో రాజకీయాలు చర్చించలేదు
  • పార్టీలను కలిపే ఉద్దేశం నాకు లేదు
  • గతంలో పవన్ పిలిస్తే నాకు ఇష్టం లేకపోయినా వెళ్లా 
సీఎం చంద్రబాబుతో ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ నిన్న సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశం గురించి మరిన్ని విషయాలను తాజాగా ఆయన ప్రస్తావించారు. ఉండవల్లి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి భేటీలో ఎలాంటి రాజకీయాంశాలు తమ మధ్య చర్చకు రాలేదని చెప్పారు. చంద్రబాబుతో భేటీ అయ్యానని జగన్ అభిమానులు ఏమనుకున్నా తనకు ఎలాంటి నష్టం లేదని, పార్టీలను కలిపే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.

గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలిచినప్పుడు తనకు ఇష్టం లేకపోయినా వెళ్లానని అన్నారు. రేపటి నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి గొడవా జరగకపోతే విభజన చట్టంలోని అంశాలు ప్రస్తావనకు వస్తాయని అన్నారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయం గురించి తెలియజెబుతూ, దేశంలోని పలు పార్టీల నేతలను టీడీపీ ఎంపీలు కలవడం ద్వారా ఏదైనా ప్రయోజనం లభించవచ్చని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Chandrababu
Jagan
Undavalli

More Telugu News