పోర్న్ వీడియో చూసి 8 ఏళ్ల బాలికను రేప్ చేసిన ఐదుగురు బాలలు

9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు బాలలు 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. మొబైల్ ఫోన్‌లో రెండు రోజులపాటు పోర్న్ వీడియో చూసిన బాలురు ఆ తర్వాత చిన్నారిని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డెహ్రాడూన్‌లోని సాహస్‌పూర్‌లో గురువారం ఈ ఘటన జరగ్గా శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. నిందితులైన చిన్నారులను అరెస్ట్ చేసిన పోలీసులు జువైనల్ హోంకు తరలించారు.

స్థానికంగా నివసించే బాలురు, ఆడుకుందామని బాలికను నమ్మించి ఓ స్నేహితుడి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దుర్మార్గానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు ఫోన్‌లో పోర్న్ సినిమా చూసినట్టు నిందితుల్లో ఒకడైన బాలుడు చెప్పాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి ప్లాన్ చేసినట్టు వివరించాడు.

నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సాహస్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ నరేశ్ రాథోడ్ తెలిపారు. ఆదివారం బాలలను అదుపులోకి తీసుకుని జువైనల్ కోర్టులో ప్రవేశపెట్టినట్టు తెలిపారు.
Go Back to Shorts
Porn
Boys
Girl
Gang Rape
Uttarakhand

More Telugu News