బిగ్ బాస్ నుంచి తనను ఎలిమినేట్ చేయాలని చిన్న పిల్లాడిలా ఏడ్చిన గణేశ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బాస్ నుంచి తనను ఎలిమినేట్ చేయాలని చిన్న పిల్లాడిలా ఏడ్చిన గణేశ్!

  • గణేష్ పై గుడ్డుతో దాడి చేసిన అమిత్
  • సీక్రెట్ టాస్క్ లో భాగంగా ఘటన
  • తట్టుకోలేక బావురుమన్న గణేష్
'ఏమైనా జరగొచ్చు' అనే ట్యాగ్ లైన్ తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బిగ్ బాస్' రెండో సీజన్ లో నిన్న కంటెస్టెంట్ గణేష్ తనను ఎలిమినేట్ చేయాలని కోరుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ హౌస్ తనకు వద్దని, తనను బయటకు పంపించి వేయాలని, తానేమీ కొట్టించుకోవడానికి రాలేదని చెబుతూ, కెమెరాల ముందుకు వచ్చి బావురుమన్నాడు. ఇంతకీ హౌస్ లో ఏం జరిగిందంటే, నిన్న వారం ప్రారంభ ఎపిసోడ్ కావడంతో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అందరూ కలసి చర్చించుకోగా, అమిత్ పేరును చెప్పారు. దీంతో అమిత్ ను ఎలిమినేషన్ కు డైరెక్టుగా నామినేట్ చేసిన బిగ్ బాస్, సీక్రెట్ టాస్క్ ను సక్సెస్ చేస్తే గట్టెక్కవచ్చని చెప్పాడు.

ఆపై అమిత్ కు ఐదు టాస్క్ లను ఇచ్చి, వాటిని ఎవరికీ తెలియకుండా పూర్తి చేయాలని ఆదేశించాడు. అందులో ఒకటి... ఓ కంటెస్టెంట్ నెత్తిపై గుడ్డుతో కొట్టాలి. అమిత్ దీనికి గణేష్ ను ఎంచుకున్నాడు. గణేష్, దీప్తి కలిసుండగా, వారి వద్దకు వచ్చిన అమిత్, అకస్మాత్తుగా గుడ్డుతో గణేష్ పై దాడికి దిగాడు. "నన్ను ఎలిమినేషన్ కు నామినేట్ చేస్తున్నట్టు చెబుతావా? నా కోపం చూడవద్దని చెప్పాను. కానీ చూశావు" అంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనతో బిత్తరపోయిన గణేష్, అది సీక్రెట్ టాస్క్ అయ్యుండవచ్చని దీప్తి చెబుతున్నా వినకుండా చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. బాత్ రూముకు వెళ్లి గట్టిగా ఏడ్చి ఆపై కెమెరాల ముందు తన గోడును వెళ్లబోసుకున్నాడు.
Ganesh
Amit
Biggboss
Eliminate

More Telugu News