నల్గొండకు చెందిన వ్యక్తే సీఎం అవుతారు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
- కాంగ్రెస్ నేతలంతా ఒక్కటైతే కేసీఆర్ పరారే
- కష్టపడే వ్యక్తులకే రాహుల్ అవకాశమిస్తారు
ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే టికెట్ అడిగే అవకాశం ఉందని, కష్టపడే వ్యక్తులకే రాహుల్ అవకాశం ఇస్తారని, కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే ఫలితం ఉంటుందని, ఎవరైనా సీఎం కావచ్చని అన్నారు. టీఆర్ఎస్ లో మాత్రం కేసీఆర్ కుటుంబానికి తప్ప మరెవరికీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని విమర్శించారు. సోనియాగాంధీపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు సబబు కాదని అన్నారు.