ఫిఫా 2018.. ఫ్రాన్స్ వర్సెస్ క్రొయేషియా తుదిపోరుకు సిద్ధం

  • లుజ్నికి స్టేడియంలో ఈరోజు రాత్రి 8.30 గంటలకి ఫైనల్ మ్యాచ్
  • ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగనున్న ఫ్రాన్స్ 
  • ఈ టోర్నీలో పెద్ద జట్లను మట్టి కరిపించిన క్రొయేషియా
ఫిఫా 2018.. రష్యా వేదికగా ఫ్రాన్స్, క్రొయేషియా జట్లు ఫైనల్ మ్యాచ్ లో తలపడనున్నాయి. మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో ఈరోజు రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.  కాగా,  ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఐదు సార్లు తలపడగా, మూడుసార్లు ఫ్రాన్స్ జట్టు విజేతగా నిలిచింది. రెండు మ్యాచ్ లు డ్రా గా ముగిశాయి.

ఇక నేటి తుదిపోరులో ఫేవరెట్ గా ఫ్రాన్స్ జట్టే బరిలోకి దిగనుంది. మరోపక్క ఈ టోర్నీలో పెద్ద జట్లకు క్రొయేషియా షాకిచ్చింది. దీంతో, క్రొయేషియా జట్టు సరికొత్త విజేతగా నిలిచే అవకాశాలూ లేకపోలేదని క్రీడా విశ్లేషకుల అంచనా. కాగా, ప్రపంచకప్ లో ప్రతి ఇరవై ఏళ్లకోసారి కొత్త చాంపియన్ జట్టు పుట్టుకొస్తోంది. 1958లో బ్రెజిల్ తర్వాత ఇరవై ఏళ్లకు అర్జెంటీనా, ఆ తర్వాత ఫ్రాన్స్ జట్లు విజేతలుగా నిలిచాయి.
 
Go Back to Shorts
fifa 2018
france
croetia

More Telugu News