Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రపంచం మొత్తంలో నాకు నచ్చిన రాజకీయనేత ఆయనే!: కేటీఆర్

  • ట్విట్టర్ వేదికగా అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ ఆసక్తికర జవాబులు
  • సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధమేనన్న మంత్రి
  • లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీపడమన్న కేటీఆర్
సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు అడిగే ప్రశ్నలు, సమస్యలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తుంటారు. తాజాగా నిర్వహించిన ట్విట్టర్ ఛాట్ లో నెటిజన్లు ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. నెటిజన్ల ఆసక్తికర ప్రశ్నలకు, అంతే ఆసక్తితో కేటీఆర్ బదులిచ్చారు. రాజకీయాలు, క్రీడలు, 2019 ఎన్నికలు, సులభతర వాణిజ్యం, నగర బహిష్కరణ మొదలైన విషయాలపై కేటీఆర్ కు ప్రశ్నలు సంధించారు. నెటిజన్లు అడిగిన ఆసక్తికర ప్రశ్నల్లో కొన్నింటికి కేటీఆర్ చెప్పిన సమాధానాలు ఇవి!

- ప్రపంచం మొత్తంలో మీకు నచ్చే రాజకీయ నేత?

కేటీఆర్ :  బరాక్ ఒబామా

- ముఖ్యమంత్రుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్పా? కేసీఆరా?

కేటీఆర్ : మీకు తెలుసు

-  ఒక రాజకీయ నేతగా మీరు సాధించిన గొప్ప విషయాల గురించి చెప్తారా? 

కేటీఆర్ : ఆ విషయం నేను రిటైరయ్యాక చెబుతా

- డిసెంబర్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనిపిస్తోందా? అందుకు మీరు సిద్ధమేనా?

కేటీఆర్ : సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా మేం సిద్ధంగా ఉన్నాం

- నగర బహిష్కరణలపై మీ అభిప్రాయమేంటి? 

కేటీఆర్ : లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు

-  2024లో జరిగే ఎన్నికల్లో ఏపీ నుంచి మీరు పోటీచేయాలని నాలాంటి యువకుల కోరిక. మీరేమంటారు?  

కేటీఆర్ : భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు!
KTR
twitter

More Telugu News