అత్యుత్తమ అమెరికా అధ్యక్షుడు ఎవరయ్యా అంటే..!
- ఒబామానే అత్యుత్తమ అధ్యక్షుడు
- మెజారిటీ అమెరికన్ల అభిప్రాయం ఇదే
- ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌కు నాలుగో స్థానం
జూన్ 5 నుంచి 12వ తేదీ మధ్య ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ సర్వే నిర్వహించింది. జీవిత కాలంలో తాము చూసిన అధ్యక్షుల్లో అత్యుత్తమమైన వారు ఎవరన్న ప్రశ్న సంధించగా 2,002 మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. మొదటి, రెండో ప్రాధాన్యత క్రమంలో సర్వే నిర్వహించగా మొదటి ప్రాధాన్యంగా 31 మంది, రెండో ప్రాధాన్యం కింద 13 మంది ఒబామాకు జై కొట్టారు. దీంతో ఆయన 44 శాతంతో అగ్రస్థానంలో నిలిచారు. ట్రంప్‌కు పది శాతం మంది తొలి ప్రాధాన్యం ఇవ్వగా, 9 శాతం మంది రెండో ప్రాధాన్యం ఇచ్చారు.