ముప్పై ఆరేళ్ల క్రితం నాటి జీతం కపిల్ దేవ్ కు ఇప్పుడందింది!
- 1979లో మోదీ స్పిన్నింగ్ కంపెనీలో పని చేసిన కపిల్ దేవ్
- మూడేళ్ల పాటు పని చేసి కొన్ని నెలలకు జీతం తీసుకున్న వైనం
- మిగిలిన మొత్తాన్ని కపిల్ కు ఇప్పుడు అందజేసిన సంస్థ
సుమారు ముప్పై ఆరేళ్ల క్రితం నాటి జీతాన్ని, కపిల్ ఇప్పుడు అందుకున్నారు. ఈ విషయాన్ని సదరు సంస్థ మేనేజర్ రాజేంద్ర శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1979లో సంస్థ డైరెక్టర్, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ వైకే మోదీ కోరిక మేరకు కపిల్ దేవ్, మోదీ గ్రూప్ లో పనిచేసినట్టు చెప్పారు. మూడేళ్లపాటు పని చేసిన కపిల్ దేవ్ కొన్ని నెలల జీతం మాత్రమే అందుకున్నారని చెప్పారు. తాజాగా, ఇందుకు సంబంధించిన లెక్కలన్నీ సరిచూసి, కపిల్ దేవ్ కు అందాల్సిన మొత్తం రూ.2.75 లక్షలను ఆయన ఖాతాలో జమ చేశామని రాజేంద్ర తెలిపారు.