బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ు 34 శాతం క‌న్నా త‌గ్గ‌కుండా చూడాలి: టీ-మంత్రి వర్గ ఉపసంఘం

11-07-2018 Wed 20:09 | Telangana
  • టీ-మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం
  • పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ు స‌కాలంలో నిర్వ‌హిస్తాం 
  • స్థానిక సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేస్తాం
ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ు 34 శాతం క‌న్నా త‌గ్గ‌కుండా చూడాల‌ని తెలంగాణ మంత్రి వర్గ ఉప సంఘం తీర్మానించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ 50 శాతం క‌న్నా రిజ‌ర్వేష‌న్లు మించ‌వ‌ద్ద‌ని ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించడానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన స‌చివాల‌యంలో ఈరోజు సమావేశమైంది. ఈ స‌మావేశానికి స‌బ్ క‌మిటీ స‌భ్యులైన మంత్రులు ఈటల రాజేందర్, కేటిఆర్, తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డితో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ప్ర‌త్యేకంగా హాజ‌రయ్యారు.

రిజ‌ర్వేష‌న్ల‌పై ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు బీసీ గ‌ణ‌న‌, పంచాయ‌తీల పాల‌క‌వ‌ర్గాల ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సీఎస్ ఎస్ కే జోషి, పంచాయతీ రాజ్ శాఖ‌ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు, న్యాయ కార్యదర్శి నిరంజన్ రావుల‌తో మంత్రుల సబ్ క‌మిటీ చ‌ర్చించింది. ఈ నెలాఖ‌రుతో పాల‌క‌వ‌ర్గాల ప‌ద‌వీకాలం ముగియ‌నుంది. ఈ లోపు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేని ప‌రిస్థితుల్లో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై కూడా మంత్రివ‌ర్గ ఉప‌సంఘం చ‌ర్చించింది. అనంత‌రం మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఈటెల రాజేంద‌ర్‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు, జోగు రామ‌న్న‌లు మీడియాతో మాట్లాడారు. స‌కాలంలో ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు త‌మ శాఖ ప‌రంగా అన్ని చ‌ర్య‌లు తీసుకున్నట్టు చెప్పారు. రిజ‌ర్వేష‌న్లు, బీసీ గ‌ణ‌న అంశాల‌పై కొంద‌రు కోర్టును ఆశ్ర‌యించిన విషయం, దీనిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను మంత్రివ‌ర్గ ఉప‌సంఘానికి వివ‌రించినట్టు తెలిపారు. గ‌త‌ పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా 61 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పించుకునే వెసులుబాటు సుప్రీంకోర్టు ఇచ్చింద‌ని, ఈసారి కూడా 50 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను మించ‌కూడదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాల‌ని నిర్ణయించిన‌ట్లు తెలిపారు. ఇప్పటికే పంచాయితీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను స‌కాలంలో నిర్వ‌హించ‌డం, స్థానిక సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేయ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని అన్నారు.

అయితే కొంతమంది పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై కేసులు వేయడం వల్ల చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుతం బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను రానున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ తగ్గకుండా చూడ‌టానికి సుప్రీం కోర్టును ఆశ్రయించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. జూలై 31 తో సర్పంచ్ ల పదవీకాలం ముగుస్తుంద‌ని, ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాలా? లేక పాల‌క‌వ‌ర్గం పదవీకాలం పొడిగించాలా? అన్నదానిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని, బీసీ గ‌ణ‌న విష‌యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాల‌నే దానిపై కూడా కేబినెట్లో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అన్నారు. రిజర్వేషన్ అంశంపై రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామ‌ని, దీనిపై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేయాల‌ని స‌బ్ క‌మిటీ నిర్ణయించిన‌ట్లు జూపల్లి పేర్కొన్నారు.
TelanganaKTReetela

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more