ఒక్క రోజులో నాలుగున్నర అడుగుల ఎత్తు పెరిగిన గోదావరి నీటిమట్టం... అంతకంతకూ పెరుగుతున్న ఉద్ధృతి!
- నిన్న గోదావరి నదిలో 26 అడుగుల నీటిమట్టం
- ఈ ఉదయం 30.6 అడుగులకు పెరిగిన నీరు
- జలకళ సంతరించుకున్న గోదారమ్మ
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో చిన్న చిన్న చెరువులు కూడా నిండుతున్నాయి. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ లో నీటి నిల్వ 8 టీఎంసీలకు చేరింది. తాలిపేరుకు భారీగా వరద నీరు వస్తుండటంతో నాలుగు గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు పరిస్థితీ ఇదే. వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, దాదాపు 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. నిన్నమొన్నటి వరకూ ఇసుక తెన్నెలతో ఎడారిలా కనిపించిన గోదారమ్మ ఇప్పుడు జలకళ సంతరించుకుంది.