బిగ్‌బాస్‌లో ప్రవేశం కోసం నూతన్ నాయుడు అన్ని కోట్లు ఖర్చు చేశాడా?
- షోలో చోటు కోసం రూ. 4 కోట్లు ఖర్చు చేసినట్టు వార్తలు
- ఎట్టకేలకు స్పందించిన నాయుడు
- బిస్కెట్లు కూడా వారు తీసుకెళ్లలేదన్న నూతన్
సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం రచ్చరచ్చ అవుతుండడంతో నూతన్ నాయుడు ఎట్టకేలకు స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రమూ నిజం లేదన్నాడు. తానొక్క పైసా కూడా ఇవ్వలేదన్నాడు. తాను డబ్బులిచ్చి షోకు వెళ్లానన్న విషయాన్ని గతంలోనూ పలు ఇంటర్వ్యూల్లో అడిగారని తెలిపారు. బిగ్‌బాస్‌ను నిర్వహిస్తున్న సంస్థకు నాలుగు కోట్ల మొత్తం చాలా చిన్నదని ఆయన పేర్కొన్నారు. సంస్థ ప్రతినిధులు తమ ఇంటికి వచ్చినప్పుడు బొకే ఇచ్చి ఆహ్వానించామని, బిస్కెట్ బాక్స్ ఒకటి ఇచ్చామని నాయుడు తెలిపాడు. అయితే, వారు అవి తీసుకునేందుకు కూడా నిరాకరించారని, వారికి నిజంగా హ్యాట్సాఫ్ అని నాయుడు చెప్పుకొచ్చారు. ఆయన ఇంత క్లారిటీ ఇచ్చాకైనా ఆ చర్చకు తెరపడుతుందో లేదో చూడాల్సిందే.