New Delhi: ఢిల్లీ డెత్ మిస్టరీలో సంచలన విషయం వెలుగులోకి.. చివరి నిమిషంలో బయటపడేందుకు భాటియా కుమారుడి విశ్వప్రయత్నం!
- చివరి నిమిషంలో బయటపడేందుకు భావనేష్ విశ్వప్రయత్నం
- ఫోరెన్సిక్ నివేదిక చెబుతున్నది ఇదే
- ప్రయత్నాలు ఫలించకే అతడు మృతి
ఢిల్లీలోని భాటియా కుటుంబం సామూహిక ఆత్మహత్యల కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 11 మంది ఇంటి సభ్యులు మోక్షం కోసం ఇష్టపూర్వకంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు తేలినా, చివరి నిమిషంలో భావనేష్ అనే వ్యక్తి ఆత్మహత్య నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నం చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫోరెన్సిక్ నివేదికలో ఇదే తేలిందని పోలీసులు తెలిపారు. .
అందరూ ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడినప్పుడు భాటియా పెద్ద కుమారుడైన భావనేష్ చివరి నిమిషంలో ఆత్మహత్య వద్దనుకున్నాడు. దీంతో బయటపడేందుకు చివరి క్షణం వరకు ప్రాణాలతో పోరాడాడు. అంతేకాదు, అతడి చేతులు అందరిలా బిగుతుగా కాకుండా వదులుగా కట్టి ఉండడాన్ని కూడా పోలీసులు గుర్తించారు. మెడకు బిగుసుకుంటున్న తాడును వదులు చేసేందుకు ప్రయత్నించినట్టు ఫోరెన్సిక్ నివేదికలో తేలినట్టు పోలీసులు తెలిపారు. చివరి క్షణం వరకు ప్రాణాలతో పోరాడినా బయటపడలేక మృతి చెందినట్టు పోలీసులు వివరించారు.