Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందులో నిజం లేదు .. కంటెంట్ వుంటే విలన్ గాను ఓకే: 'సింధూర పువ్వు' రాంకీ

  • కథ, కథనాలు కొత్తగా అనిపించాయి
  • హీరోకి అండగా నిలబడే పాత్రలో కనిపిస్తాను 
  • నా పాత్ర నాకు చాలా బాగా నచ్చింది      
తెలుగులో రాంకీ గతంలో కొన్ని సినిమాలు చేశాడు .. కానీ 'సిందూర పువ్వు' రాంకీ అంటేనే ఎవరికైనా వెంటనే గుర్తుకువస్తారు. తమిళంలోను సీనియర్ హీరోగా ఆయనకి మంచి పేరుంది. ఈ మధ్య కాలంలో అడపాదడపా మాత్రమే తెలుగులో చేస్తూ వస్తోన్న రాంకీ, తాజాగా 'ఆర్ ఎక్స్ 100' అనే సినిమా చేశారు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్రను నేను చేస్తేనే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావించారు. నా కోసం చెన్నై వచ్చి నా పాత్ర గురించి చెప్పారు. కొత్తగా అనిపించడంతో ఎంతమాత్రం ఆలోచించకుండా అంగీకరించాను. ఈ సినిమాలో నేను హీరోకి తండ్రి పాత్రలో కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతోంది .. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు.

 ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో నాకు పెళ్లే కాదు .. అయినా హీరోకి అండగా నిలబడతాను .. అందుకు కారణం ఏంటనేదే ఆసక్తికరంగా ఉంటుంది. ఇకపై కేరక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాదు .. కంటెంట్ వుంటే విలన్ గాను చేయడానికి సిద్ధమే" అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.  
ramki

More Telugu News